← Back to news

వర్షాలు లేక బీటలు బారుతున్న వరి పొలాలు

By DK· 2d ago
వర్షాలు లేక బీటలు బారుతున్న వరి పొలాలు

TG: నారాయణపేట జిల్లాలో వర్షాలు లేక పంటలు ఎండిపోతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ధన్వాడ మండలం రాంకిష్టాయపల్లి, కిష్టాపూర్, కొండాపూర్, హన్మన్పల్లి, మందిపల్లి, మణిపూర్ండా తదితర గ్రామాల్లో వరి పొలాలు బీటలు బారుతున్నాయి. సాగు సమయంలో నీటితో కళకళలాడిన బోర్లు ప్రస్తుతం ఆగిపోవడంతో పాటు పలుచోట్ల ఎండిపోతున్నాయి. కొత్తగా బోర్లు తవ్వించినా నీరు పడక రైతులు అప్పుల్లో కూరుకుపోతున్నారు. పంట దిగుబడి తగ్గడంతో పెట్టుబడి కూడా తిరిగిరాని పరిస్థితి ఏర్పడిందన్నారు.

More in Local