‘Vote Chori’ నిరసనలో మహిళా కార్యకర్తపై దాడి.. NSUI ఆరోపణ!
ఢిల్లీలో ‘ఓట్ చోరీ’ ఆరోపణలపై ప్రొటెస్ట్ చేస్తున్న NSUI స్టూడెంట్స్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్ దగ్గర కాంగ్రెస్ విద్యార్థి సంఘం సభ్యులు ఫ్లాష్ ప్రొటెస్ట్ చేపట్టారు. CEC జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు స్టూడెంట్స్పై దాడి చేశారని, ఓ మహిళా కార్యకర్తను కూడా కొట్టారని NSUI ఆరోపించింది. శాంతియుతంగా నిరసన తెలిపిన స్టూడెంట్స్, మహిళాను ఇలా ట్రీట్ చేయడం సిగ్గుచేటని విమర్శించింది.


