IIT బాంబేలో నిరసనకు నేహా బోరా పిలుపు

IIT బాంబే విద్యార్థి సాహిల్ వాకోడే మరణంపై న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నేహా బోరా నిరసనకు పిలుపునిచ్చారు. సాహిల్ తల్లిదండ్రులు న్యాయం కోసం పోరాడుతుండగా, విద్యార్థులు కూడా వారికి సపోర్ట్గా నిలుస్తున్నారు. క్యాంపస్లో దళిత, బహుజన విద్యార్థులు ఎందుకు భయపడాల్సి వస్తోందని ప్రశ్నిస్తూ, IIT యాజమాన్యం దీనిపై సమాధానం చెప్పాలని ఆమె కోరారు. అక్టోబర్ 14 మధ్యాహ్నం 12 గంటలకు IIT బాంబేలో జరిగే నిరసనలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.



