← Back to news

'మహిళలతో పెట్టుకున్నందుకే BRS ఓడిపోయింది'

By DK· 9 Jun 2026· Eenadu· హైదరాబాద్‌
'మహిళలతో పెట్టుకున్నందుకే BRS ఓడిపోయింది'

మహిళలతో పెట్టుకున్నందుకే BRS పార్టీ ఓడిపోయిందని CM రేవంత్ రెడ్డి అన్నారు. స్వయం సహాయక బృందాలకు 553 ఆర్టీసీ బస్సులు పంపిణీ చేసిన సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన మహిళా శక్తి మీటింగ్‌లో సీఎం పాల్గొని మాట్లాడారు. ఇందిరమ్మ రాజ్యంలోనే మహిళలకు గుర్తింపు ఉంటుందన్నారు. మహిళలకు ఇవ్వాల్సిన రూ.4 వేల కోట్ల సున్నా వడ్డీ నగదును గత ప్రభుత్వం చెల్లించలేదు. తాము మహిళల ఉచిత బస్సు ప్రయాణం కోసం ఆర్టీసీకి రూ.10,500 కోట్లు చెల్లించామన్నారు.

More in Politics