← Back to news

పద్మారావునగర్‌లో బతుకమ్మ సంబరాలు.. ఫుల్ జోష్!

By E. Chandrashekhar· 15h ago· Chilakalguda, Secunderabad, Hyderabad
పద్మారావునగర్‌లో బతుకమ్మ సంబరాలు.. ఫుల్ జోష్!

సికింద్రాబాద్ పద్మారావునగర్‌లో శుక్రవారం రాత్రి బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. జి పవన్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ ఈవెంట్ నిర్వహించారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చిన్నారులు దేవతా వేషధారణతో ఆకట్టుకున్నారు. తలసాని మాట్లాడుతూ.. ప్రకృతిని ఆరాధించే పండుగ బతుకమ్మ అని కొనియాడారు. ఆయన మహిళలతో కలిసి బతుకమ్మ ఆడుతూ డాన్స్ చేశారు. మహిళలు బతుకమ్మ పాటలతో నృత్యాలు చేశారు. బతుకమ్మ ఐక్యతకు ప్రతీక.

More in Local