మట్టపర్రు రోడ్డులో భారీ గొయ్యి..! డేంజర్ డేంజర్

డా.బి.ఆర్ అంబేడ్కర్, కోనసీమ జిల్లా, రాజోలు మండలంలోని చింతలపల్లి-మట్టపర్రు రోడ్డు ప్రమాదకరంగా మారింది. ఇటీవలే వేసిన ఈ రోడ్డు కృంగిపోయి, భారీ గొయ్యి ఏర్పడింది. దీంతో ఆ రోడ్డు మీదుగా వెళ్లే వాహనదారులు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. "వెంటనే అధికారులు స్పందించి రోడ్డు మరమ్మత్తు చేయాలి" అని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే చాలామంది వాహనదారులు ఇక్కడ పడిపోయి గాయపడ్డారని, ఇది చాలా ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు.అధికారులు నిర్లక్ష్యం చేస్తే, ఇక్కడ పెద్ద ప్రమాదం జరగడం ఖాయమంటున్నారు.




