కల్లూర్ సర్పంచ్, ఉపసర్పంచ్‌ల చెక్‌పవర్ రద్దు: కలెక్టర్

నిర్మల్ జిల్లా కుంటాల మండలం కల్లూర్ గ్రామపంచాయతీలో నిధుల దుర్వినియోగం, నిబంధనల ఉల్లంఘనలపై కలెక్టర్ భవేశ్ మిశ్రా చర్యలు తీసుకున్నారు. సర్పంచ్ పెంట దశరథ్, ఉపసర్పంచ్ సూర్యవంశీ నారాయణల చెక్‌పవర్‌ను ఆరునెలలపాటు నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. 15వ ఆర్థికసంఘం నిధుల వినియోగంపై వచ్చిన ఫిర్యాదుల మేరకు అధికారులు విచారణ చేపట్టగా, నిబంధనలకు విరుద్ధంగా ₹.5,85,933 గ్రామపంచాయతీ నిధులను సర్పంచ్ కుటుంబసభ్యుల పర్సనల్ బ్యాంక్ అకౌంట్‌కు మళ్లించినట్లు గుర్తించారు.



