← Back to news

నాని ‘ది ప్యారడైజ్’పై KTR ప్రశంసలు

By Sharmila· 1d ago

TG: BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR.. యాక్టర్ నాని నటించిన ‘ది ప్యారడైజ్’ సినిమాను హైదరాబాద్‌లోని సుదర్శన్ థియేటర్‌లో చూశారు. చాలా ఏళ్ల తర్వాత థియేటర్‌కు వెళ్లి సినిమా చూసినట్లు ఆయన Xలో తెలిపారు. సినిమా చూసిన తర్వాత డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల, నాని, ప్రియదర్శి నటనను KTR ప్రశంసించారు. తెలంగాణ భాష, యాస, సంస్కృతిని సినిమాలో బాగా చూపించారని అన్నారు. అణచివేతకు వ్యతిరేకంగా ప్రజల పోరాటాన్ని మూవీ చూపించిందని తెలిపారు.

More in Entertainment