← Back to news

సెల్‌ఫోన్ వ్యసనానికి దూరంగా ఉండాలి: IGP

By KUCHIPUDI BUJJIBABU· 1h ago· Salivahanapeta, Mangalagiri, Guntur
సెల్‌ఫోన్ వ్యసనానికి దూరంగా ఉండాలి: IGP

గుంటూరు ప్రభుత్వ మహిళా కళాశాలలో నిర్వహించిన ‘దీక్షారంభ్’ ముగింపు కార్యక్రమానికి AP ఈగల్ చీఫ్ IGP ఆకే రవికృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్పష్టమైన లక్ష్యం, పట్టుదల, క్రమశిక్షణతో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని విద్యార్థినులకు సూచించారు. సెల్‌ఫోన్ వ్యసనం, సోషల్ మీడియా ప్రభావానికి దూరంగా ఉంటూ చదువు, క్రీడలు, యోగాపై దృష్టి పెట్టాలన్నారు. డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, వాటి సమాచారం తెలిస్తే 1972 టోల్‌ఫ్రీ నంబర్‌కు తెలియజేయాలని కోరారు.

More in Local