← Back to news

తాడేపల్లి బైపాస్ వద్ద మట్టి వినాయకుల పంపిణీ

By KUCHIPUDI BUJJIBABU· 1d ago· Bhadravathi Nagar, Mangalagiri, Guntur

AP: పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయక విగ్రహాల వినియోగాన్ని ప్రోత్సహిస్తూ గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఉచితంగా మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. వినాయక చవితిని పురస్కరించుకుని రోటరీ క్లబ్ తాడేపల్లి ఆధ్వర్యంలో బైపాస్ రోడ్డు వద్ద గోపు ఫిల్లింగ్ స్టేషన్‌లో ఈ కార్యక్రమం నిర్వహించారు. రోటరీ క్లబ్ ప్రతినిధులు, సభ్యులు భక్తులకు మట్టి వినాయక ప్రతిమలను ఉచితంగా అందజేశారు. రసాయన రంగులతో తయారైన విగ్రహాల నిమజ్జనం వల్ల నీటి వనరులు కలుషితం అయ్యే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు.

More in Local