CECకి వ్యతిరేకంగా టీవీకే గళం.. INDIA కూటమితోపాటు నిరసన
తమిళనాడు రాజకీయాల్లో కొత్త పరిణామం జరుగుతోంది. ‘ఇండియా’ (INDIA) కూటమి చేపట్టిన నిరసన కార్యక్రమంలో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం(TVK) పార్టీ అధికారికంగా భాగమైంది. CEC జ్ఞానేశ్ కుమార్ రిజైన్ చేయాలని డిమాండ్ చేస్తూ చెన్నైలో ఆందోళన చేశారు. టీవీకేతో పాటు కాంగ్రెస్, ఇతర ఇండియా కూటమి పక్షాల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


