స్టార్‌లింక్ కంటే మేమే ముందున్నాం

భారత్‌లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవల ప్రారంభంపై పోటీ పెరుగుతోంది. ఎయిర్‌టెల్‌కు చెందిన వన్‌వెబ్ సంస్థ స్టార్‌లింక్ కంటే ముందుగా అప్లై చేసుకుందని, అనుమతుల విషయంలో తాము ముందున్నామని ఎయిర్టెల్ ఛైర్మన్ సునీల్ మిట్టల్ చెప్పారు. తమ నెట్వర్క్ మూడేళ్లుగా సిద్ధంగా ఉందని, అయినా ప్రభుత్వ అనుమతులు రావాల్సి ఉందని తెలిపారు. మరోవైపు, స్టార్‌లింక్, జియో సంస్థలు కూడా సేవలు ప్రారంభించేందుకు ఎదురుచూస్తున్నాయి.


