LPUలో రచ్చ రచ్చ
విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ జరిగిందనే ఆరోపణలతో పంజాబ్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ - LPU విద్యార్థులు అర్థరాత్రి తర్వాత రచ్చ చేశారు. గర్ల్స్ హాస్టల్ దగ్గర మొదలైన ఆందోళనలు క్రమంగా పెరిగాయి. క్యాంపస్‌లో టర్న్‌స్టైల్‌లు, గేట్లను ధ్వంసం చేశారు. భవనాలకు నిప్పు పెట్టారు. చండీగఢ్-అమృత్‌సర్ హైవేని దిగ్బంధించారు. తమకు ఏ కంప్లైంటూ రాలేదనీ, రేప్ ఆధారాలు లేవని పోలీసులు అంటున్నారు. ఇది రూమర్ నుంచి పుట్టిన ప్రొటెస్ట్ అంటున్నారు. దీనిపై ఎంక్వైరీ జరుగుతోంది.
