స్వర్ణకారుడు సత్యకృపాల్ డాంగే మృతి..!

గుంటూరు జిల్లా మంగళగిరిలో స్వర్ణకార రంగంలో 35 ఏళ్లకు పైగా సేవలందించిన సత్యకృపాల్ డాంగే (72) ఆదివారం సాయంత్రం అనారోగ్యంతో మృతి చెందారు. 1954 జులై 1న కాజ గ్రామంలో జన్మించిన ఆయన పెదకాకాని, గుంటూరులో విద్యాభ్యాసం చేశారు. 1977లో వ్యాపారంలో అడుగుపెట్టి మంగళగిరిలో తాకట్టు, జ్యుయలరీ వ్యాపారంలో స్థిరపడ్డారు. కమ్యూనిస్టు భావజాలం కలిగిన ఆయన జ్యుయలరీ అండ్ బులియన్ మర్చంట్స్ అసోసియేషన్ సెక్రటరీగా, స్వర్ణకార సంఘం గౌరవాధ్యక్షులుగా సేవలందించారు. డాంగే మృతితో షరాఫ్ బజారు విషాదంలో మునిగింది.
