'బాలికలకు సమాన అవకాశాలు కల్పించాలి'
అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాకలో 'GAMANA' సంస్థ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పెనుమాక హైస్కూల్ నుంచి పంచాయతీ కార్యదర్శి కార్యాలయం వరకు విద్యార్థినులు ర్యాలీ చేపట్టారు. బాలికల హక్కులు, విద్య, ఆరోగ్యం, భద్రత, లింగ సమానత్వం, బాల్యవివాహాల నివారణపై నినాదాలు చేశారు. బాలికలకు సమాన అవకాశాలు కల్పించి, విద్యతో ప్రోత్సహించాలని నిర్వాహకులు కోరారు.


