స్టూడెంట్స్కు సేఫ్టీపై షీ టీమ్స్ అవేర్నెస్!

TG: మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోని జవహర్నగర్ షీ టీమ్స్, తుమ్ముకుంటలోని విశ్వ విశ్వాని కాలేజీలో స్టూడెంట్స్కు అవేర్నెస్ ప్రోగ్రామ్ నిర్వహించాయి. మహిళల సేఫ్టీ, పిల్లల రక్షణ, గుడ్ టచ్–బ్యాడ్ టచ్, హ్యూమన్ ట్రాఫికింగ్, చైల్డ్ మ్యారేజెస్, సైబర్ క్రైమ్, లోన్ యాప్ మోసాలు, ర్యాగింగ్పై అవగాహన కల్పించాయి. ఎమర్జెన్సీకి 112, సైబర్ మోసాల కోసం 1930కు కాల్ చేయాలని, పోలీస్ వాట్సాప్ నంబర్ 8712662111ను సంప్రదించవచ్చని తెలిపాయి.

