← Back to news

సూర్యాపేటలో బుల్లెట్ ట్రైన్ కారిడార్ సాధన దీక్షలు

By సైదులు· 7h ago· Suryapet
సూర్యాపేటలో బుల్లెట్ ట్రైన్ కారిడార్ సాధన దీక్షలు

సూర్యాపేట మీదుగా బుల్లెట్ ట్రైన్ కారిడార్, రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయాలని అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న దీక్షలు 33వ రోజుకు చేరాయి. తెలంగాణ యువజన సంఘం, లంబాడీ విద్యార్థి సేన జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ధరావత్ శివ నాయక్ లీడర్‌షిప్‌లో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షా శిబిరాన్ని తెలంగాణ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంతుల మధు సందర్శించి ఫుల్ సపోర్ట్ తెలిపారు. సూర్యాపేట రైల్వే లైన్ కోసం పోరాటం కొనసాగిస్తామని చెప్పారు.

More in Local