టీడీపీ కూటమిని ఓడించడమే లక్ష్యం: సీపీఎం

మంగళగిరి నుంచి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసే వామపక్ష, ప్రజాతంత్ర శక్తులను గెలిపించాలని సీపీఎం నాయకులు పిలుపునిచ్చారు. ఆత్మకూరులో పండల ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో టీడీపీ కూటమిని ఓడించేందుకు కలిసి వచ్చే ప్రజాతంత్ర శక్తులతో పోటీ చేయాలని నిర్ణయించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థలను బలహీనపరుస్తోందని జిల్లా కార్యదర్శి వై. నేతాజీ విమర్శించారు.



