← Back to news

కడియం శ్రీహరికి కొండా సురేఖ ఓపెన్ ఛాలెంజ్!

By sahani· 9 Jul 2026· Telangana
కడియం శ్రీహరికి కొండా సురేఖ ఓపెన్ ఛాలెంజ్!

TG: MLA కడియం శ్రీహరిపై మంత్రి కొండా సురేఖ ఘాటుగా ఫైర్ అయ్యారు. ఆయన 40 ఏళ్లు పాలిటిక్స్‌లో ఉండి, ఇప్పుడు నార్మల్ MLA పదవిలో ఇమడలేకపోతున్నారని, దమ్ముంటే మంత్రి పదవి తెచ్చుకోవాలని, లేదంటే పాలిటిక్స్‌కి రిజైన్ చేసి ఇంట్లో ఉండాలని కామెంట్స్ చేశారు. కడియం శ్రీహరికి అంత నిజాయితీ ఉంటే, MLA పదవికి రాజీనామా చేసి మళ్లీ కాంగ్రెస్ నుండి గెలిచి చూపించాలని ఛాలెంజ్ చేశారు. ఈ ఇష్యూపై ఆల్రెడీ మహేష్ కుమార్ గౌడ్‌ను కలిశానని, 14న మీనాక్షి నటరాజన్‌కు కూడా కంప్లైంట్ చేస్తానని కొండా సురేఖ చెప్పారు.

More in Politics