← Back to news

రాజ్యాంగ హక్కుల సమితి గౌరవ అధ్యక్షుడిగా పశువుల గోపాల్..!

By KP· 1d ago
రాజ్యాంగ హక్కుల సమితి గౌరవ అధ్యక్షుడిగా పశువుల గోపాల్..!

మహబూబ్ నగర్ జిల్లాలో రాజ్యాంగ హక్కుల సాధన సమితి నూతన గౌరవ అధ్యక్షుడిగా పశువుల గోపాల్ ఎన్నికయ్యారు. రేమో వర్షిప్ సెంటర్ దైవ సేవకులు రెవరెండ్ డాక్టర్ పరంజ్యోతి, సంఘ పెద్దలు లక్ష్మణ్, శ్యామ్ ఆయనను ఘనంగా సన్మానించారు. క్రైస్తవ సమాజం తనపై ఉంచిన నమ్మకంతో ఈ బాధ్యత గౌరవంగా స్వీకరిస్తున్నానని గోపాల్ అన్నారు. దళిత క్రైస్తవులకు SC హోదా వచ్చేంతవరకు, 1950 రాష్ట్రపతి ఉత్తర్వుల్లోని పారా-3 రద్దయ్యేంతవరకు కృషి చేస్తానని తెలిపారు. క్రైస్తవ సమాజ హక్కుల సాధన కోసం రాజ్యాంగబద్ధంగా పోరాడతానని స్పష్టం చేశారు.

More in Local