← Back to news

రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు

By Sharmila· 6h ago
రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు

AP:ఆంధ్రప్రదేశ్‌లో గ్రామాలను మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో విలీనం చేసే అంశంపై సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. గ్రామ పంచాయతీల తీర్మానాలు లేకుండా, చట్టపరమైన నిబంధనలు పాటించకుండానే విలీనం చేశారని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఈ వ్యవహారంలో తుది నిర్ణయం సుప్రీంకోర్టు ఆదేశాలకు లోబడి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. ఈ నోటిస్‌పై రాష్ట్ర ప్రభుత్వం త్వరగా వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు తెలిపింది.

More in AP