← Back to news

ట్యాంక్ బండ్‌పై ఆంక్షలు

By Sahani· 9 Oct 2026· X· Hyderabad

ట్యాంక్ బండ్, సిటీ రోడ్లు, చెరువుల వద్ద, పార్కులలో మిడ్‌నైట్ బర్త్‌డే సెలబ్రేషన్స్, కేక్ కటింగ్స్ చేయడం పూర్తిగా నిషేధమని IPS అధికారి V.C. సజ్జనార్ స్పష్టం చేశారు. రెండు రోజుల క్రితం అర్ధరాత్రి 2 గంటల సమయంలో ట్యాంక్ బండ్‌పై జరిగిన రోడ్ యాక్సిడెంట్‌లో ఆరేళ్ల చైల్డ్‌తో పాటు ఒకరు చనిపోవడంపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అర్ధరాత్రి రోడ్లపై వెహికల్స్ స్పీడ్‌గా వెళ్తుంటాయని, కేవలం క్షణకాలం ఆనందం కోసం ప్రాణాలను రిస్క్‌లో పెట్టవద్దని ముఖ్యంగా యూత్ అండ్ పేరెంట్స్‌కు ఆయన విజ్ఞప్తి చేశారు.

More in Current Affairs