బావిలో గుర్తుతెలియని మృతదేహం

జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని శాంతినగర్ పట్టణ శివారులో డెడ్‌బాడీ కలకలం రేపింది. జమ్మలమ్మ ఆలయం పక్కన ఉన్న బావిలో గుర్తుతెలియని పురుషుడి మృతదేహం లభ్యమైంది. మృతుడి వయసు సుమారు 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు. మృతుడిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. అతడిని ఎవరైనా గుర్తిస్తే వెంటనే శాంతినగర్ పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. వివరాల కోసం 8712670290 నంబర్‌ను సంప్రదించాలని పోలీసులు సూచించారు.


