← Back to news

అభివృద్ధి పనులపై మంత్రి ఫరూక్ సమీక్ష

By P.Abhi· 2h ago· Nandyala, Nandyal Urban, Nandyal
అభివృద్ధి పనులపై మంత్రి ఫరూక్ సమీక్ష

నంద్యాల క్యాంపు కార్యాలయంలో మంత్రి ఫరూక్ ముఖ్యకార్యకర్తలు, నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గ రాజకీయ పరిస్థితులు, అభివృద్ధి పనుల పురోగతిపై చర్చించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని మంత్రి సూచించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి కార్యకర్తలు చొరవ చూపాలని చెప్పారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

అభివృద్ధి పనులపై మంత్రి ఫరూక్ సమీక్ష
అభివృద్ధి పనులపై మంత్రి ఫరూక్ సమీక్ష

More in Local