బైక్‌పై తీసుకెళ్లి.. ధ్రువీకరణ పత్రం అందేలా కృషి

అల్లూరి జిల్లా అనంతగిరి మండలం ఎన్‌ఆర్ పురం పంచాయతీ పరిధిలోని పెదకూనెల గ్రామానికి చెందిన కోటిపర్తి జోగయ్య అనారోగ్యంతో విజయనగరం మహారాజా ఆసుపత్రిలో అక్టోబర్ 3న మృతి చెందారు. మరణ ధ్రువీకరణ పత్రం పొందేందుకు కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకున్న యువ నాయకుడు కోటపర్తి శ్రీను స్పందించారు. తన బైక్‌పై వారిని విజయనగరానికి తీసుకెళ్లి, అవసరమైన ప్రక్రియ పూర్తి చేయించి ధ్రువీకరణ పత్రం అందేలా సహకరించారు.

