← Back to news

అండర్-12 పరుగు పందెంలో శ్రేయాస్ విజయం

By Pinjari Shiva Kumar· 2h ago· Peddapur, Metpalli, Jagitial
అండర్-12 పరుగు పందెంలో శ్రేయాస్ విజయం

జగిత్యాల జిల్లా మెట్‌పల్లి ప్రాంతంలోని ఆరపేట వాగ్దేవి పాఠశాలకు చెందిన 5వ తరగతి విద్యార్థి అల్లూరి శ్రేయాస్ రెడ్డి అథ్లెటిక్స్ పోటీల్లో ప్రతిభ చాటారు. కోరుట్ల మినీ స్టేడియంలో జరిగిన జిల్లాస్థాయి పోటీల్లో అండర్-12 విభాగం 300 మీటర్ల పరుగు పందెంలో విజయం సాధించారు. దీంతో ఈ నెల 11న ఆసిఫాబాద్‌లో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ విషయాన్ని జిల్లా అథ్లెటిక్స్ కార్యదర్శి ముత్తయ్య రెడ్డి తెలిపారు.

More in Local