← Back to news

తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు

By Kamal Kumar· 1d ago· Vikarabad
తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు

వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం జీవన్గి గ్రామంలో వేసవి తాగునీటి సమస్యను నివారించేందుకు సర్పంచ్ రామణి బసప్ప ముందస్తు చర్యలు చేపట్టారు. ఎండల తీవ్రత పెరగడంతో పాటు విద్యుత్ సరఫరాలో అంతరాయాల వల్ల నీటి సరఫరాకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. దీంతో గ్రామంలోని చేతిపంపుల మరమ్మతు పనులను ముమ్మరం చేశారు. ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ముందుగానే స్పందించి మరమ్మతులు చేపట్టడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

More in Local