నత్తనడకన ROB పనులు.. కాంగ్రెస్ నాయకుల ధర్నా

TG: మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ROB నిర్మాణాన్ని వెంటనే పూర్తిచేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్‌లో కాంగ్రెస్ నాయకులు ధర్నా చేపట్టారు. తీగలగుట్టపల్లి రైల్వే గేట్ వద్ద నిర్వహించిన నిరసనలో 3వ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు మూల కృష్ణారెడ్డి మాట్లాడారు. ROB పనులు నత్తనడకన సాగుతుండటంతో వాహనదారులు, గర్భిణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఐదునిమిషాల్లో చేరాల్సిన ప్రయాణానికి గంట సమయం పడుతోందని ఆవేదన వ్యక్తంచేశారు. MP బండి సంజయ్ ఎన్నికల సమయంలో శంకుస్థాపన చేసి వదిలేశారని విమర్శించారు.



