ఆ ఘటనలో ఏడుగురు అరెస్ట్!

సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలో మాజీ CM కేసీఆర్ ఫాంహౌస్ వద్ద పసుపు నీటితో శుద్ధి చేసిన ఘటనపై పోలీసులు ఏడుగురిని అరెస్ట్ చేశారు. వరదరాజ్‌పూర్ మాజీ సర్పంచ్ ప్రవీణ్‌తో పాటు భాను, మల్లేశం, ఐలయ్య, ఆర్కల రాజు, అమరేందర్, కొడారి రాజులను అదుపులోకి తీసుకున్నారు. విజయవాడలోని ఓ లాడ్జిలో ఉన్న నిందితులను సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా గుర్తించి అరెస్ట్ చేసినట్లు సమాచారం. గజ్వేల్‌లో మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించారు. మరో ఇద్దరు నిందితులు బాలముని, కనకయ్య పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.



