ప్లాస్టిక్ వాడుతున్న వాళ్ళకి ఫైన్ వేస్తున్న అధికారులు

నిర్మల్ జిల్లా కేంద్రంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకంపై మున్సిపల్ అధికారులు సీరియస్ అయ్యారు. కమిషనర్ రవిబాబు ఇతర సిబ్బందితో కలిసి షాప్స్‌లో సడన్ తనిఖీలు చేశారు. ప్లాస్టిక్ కవర్లు అమ్ముతున్న షాపు ఓనర్స్ కి 9,500 రూపాయిల ఫైన్ వేశారు. బ్యాన్ చేసిన ప్లాస్టిక్‌ను అస్సలు వాడొద్దని, దానికి బదులు క్లాత్, జనుము సంచులే యూజ్ చేయాలని కమిషనర్ సూచించారు.



