రోడ్లపై చెత్త వేస్తే దుకాణం బంద్

విశాఖపట్నంలో రోడ్లపై చెత్త వేస్తున్న దుకాణాలపై GVMC అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.డస్ట్‌బిన్లు ఏర్పాటు చేయని 58 షాపులను సీజ్ చేసి ₹4.36 లక్షల ఫైన్ విధించారు. కమిషనర్ కేతన్ గార్గ్ అలిపురంలో స్వయంగా ఓ షాపును సీజ్ చేసి ₹25 వేలు ఫైన్ వేశారు. ఫైన్ చెల్లించిన తర్వాతే సీజ్ చేసిన షాపులను తిరిగి తెరవడానికి పర్మిషన్ ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. చెత్త రోడ్లపై వేస్తె కఠినంగా శిక్షిస్తామని GVMC కమిషనర్ కేతన్ గార్గ్ హెచ్చరించారు.



