← Back to news

ఖతార్‌ గ్యాస్‌ ప్లాంట్‌లో పేలుడు.. 12మంది భారతీయులు మృతి

By డీకే· 23 Jun 2026· Eenadu
ఖతార్‌ గ్యాస్‌ ప్లాంట్‌లో పేలుడు.. 12మంది భారతీయులు మృతి

ఖతార్‌లోని ప్రముఖ గ్యాస్ ప్లాంట్‌లో భారీ పేలుడు సంభవించింది. ఘటనలో 13మంది మృతి చెందారు. వారిలో 12 మంది భారతీయులేనని నిర్ధారణ అయింది. పేలుడు తీవ్రతకు 66మంది గాయపడ్డారు. వారిలో ఖతార్, భారత్, పాక్ సహా పలు దేశాలవారు ఉన్నారు. గాయపడ్డవారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని దోహాలోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. హర్మూజ్ జలసంధి మూసివేత కారణంగా ఈ గ్యాస్ ప్లాంట్‌లో ఉత్పత్తిని ఖతార్ ఆపేసింది. తాజాగా కార్యకలాపాలను పునఃప్రారంభించేందుకు ప్రయత్నించగా గ్యాస్ సరఫరా ప్లాంట్లో భారీ పేలుడు చోటుచేసుకుంది.

More in World