బడిలో బాలుడి ‘లవ్ లెటర్’.. ఆ తర్వాత?

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో 4వ తరగతి బాలుడు తన క్లాస్‌మేట్‌కు ‘I love you’ అంటూ లవ్ లెటర్ రాశాడు. విషయం తెలుసుకున్న టీచర్ బాలుడిని మందలించినట్లు సమాచారం. అయితే బాలుడిని కొట్టారని తల్లిదండ్రులు పోలీసులకు కంప్లైంట్ చేశారు. మరోవైపు కుటుంబం 25 లక్షల రూపాయల నష్టపరిహారం డిమాండ్ చేసిందని స్కూల్ మేనేజ్‌మెంట్ చెప్పింది. ఈ విషయంపై పోలీసులు విచారిస్తున్నారు. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.



