చేయూత పెన్షన్స్పై స్పెషల్ ఫోకస్!

TG: రాష్ట్రంలో చేయూత పెన్షన్స్కి వచ్చిన అప్లికేషన్స్ వెరిఫికేషన్ కొనసాగుతోంది. హైదరాబాద్ జిల్లాలో ఇప్పటివరకు 36,941 మందిని అర్హులుగా 5,193 మందిని అనర్హులుగా గుర్తించారు. మరో 1,927 దరఖాస్తుల పరిశీలన పెండింగ్లో ఉంది. వీటిని వారంలోగా పూర్తి చేస్తామని జిల్లా అదనపు కలెక్టర్ జితేందర్ రెడ్డి తెలిపారు. విచారణలో పారదర్శకత కోసం 16 మంది ప్రత్యేక అధికారులను నియమించి, దరఖాస్తుదారుల ఇళ్ల వద్ద ర్యాండమ్ వెరిఫికేషన్ చేస్తున్నామని తెలిపారు.
