పండగకు 10 కోట్లు..

TG: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ. ఈ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 10 కోట్లు కేటాయించింది. రేపటి నుంచి 18 వరకు తొమ్మిది రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ ఉత్సవాలు జరగనున్నాయి. చివరి రోజైన 18న హైదరాబాద్‌లో సద్దుల బతుకమ్మను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు ఘనంగా జరిగేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం లాంగ్వేజ్ అండ్ కల్చర్ డిపార్ట్‌మెంట్‌ను ఆదేశించింది.


