ఎన్నికల నిర్వహణపై అధికారులకు ఆదేశాలు

శ్రీకాకుళం జిల్లా పలాస, ఇచ్ఛాపురం మున్సిపాలిటీల్లో ఎన్నికల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పరిశీలించారు. ఎన్నికల రిసెప్షన్ కేంద్రాలు, మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ పాయింట్లు, స్ట్రాంగ్ రూమ్లను తనిఖీ చేశారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం భద్రత, సీసీ కెమెరాల నిఘా, కౌంటింగ్ ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ ఎన్నికలను స్వేచ్ఛాయుతంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని సూచించారు.



