దసరా క్రీడలకు శ్రీకారం.. పెద్ది సేవలు స్ఫూర్తి!

వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని రుద్రగూడెం పెద్ద తండాలో స్నేహ బంజారా యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డివిజన్ స్థాయి దసరా క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు డాక్టర్ బానోత్ సారంగపాణి క్రికెట్, వాలీబాల్, కబడ్డీ పోటీలను ప్రారంభించారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సేవలు స్ఫూర్తిదాయకమని, క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఐక్యత పెంచుతాయని ఆయన అన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.



