‘కన్నీటి సంద్రం కళింగాంధ్ర’ పుస్తకావిష్కరణ
కళింగాంధ్ర ప్రజల కష్టాలు, కన్నీళ్లు, వలసల నేపథ్యాన్ని ‘కన్నీటి సంద్రం కళింగాంధ్ర’ పుస్తకంలో రచయిత గార రంగనాథం కళ్లకు కట్టినట్లు వివరించారని ప్రముఖ కవి, సాహితీవేత్త సుంకిరెడ్డి నారాయణరెడ్డి తెలిపారు. విజయనగరం జిల్లా రాజాంలో రాజాం రచయితల వేదిక ఆధ్వర్యంలో పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ నుంచి ముఖ్య అతిథిగా హాజరైన సుంకిరెడ్డి నారాయణ రెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించారు. కళింగ ప్రజల ఆవేదనకు ఈ పుస్తకం అక్షర రూపమని చెప్పారు.
