ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడిగా మాడుగుల రాజ్ కుమార్

హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షుడు మాడుగుల సంతోష్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో అధ్యక్షుడిగా మాడుగుల రాజ్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా మాడుగుల రామకృష్ణ, ఉపాధ్యక్షుడిగా గౌడ చంద్రబాబు, కోశాధికారిగా వుడుత శ్రీనాథ్, కార్యదర్శిగా కనకం వెంకటేష్ ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా మేకల శ్యామ్, మాట్ల హరికుమార్, వెంకటేష్‌ను ఎన్నుకున్నారు.


