← Back to news

భావనా ఋషి స్వామి దేవస్థానంలో వినాయక చవితి

By KUCHIPUDI BUJJIBABU· 1d ago· Bhadravathi Nagar, Mangalagiri, Guntur

AP: గుంటూరు జిల్లా మంగళగిరి పాత మంగళగిరిలోని శ్రీ భద్రావతి సమేత భావనా ఋషి స్వామి దేవస్థానంలో భాద్రపద శుద్ధ చవితి సందర్భంగా వినాయక చవితి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఉదయం శ్రీ విఘ్నేశ్వర పూజ, అభిషేక కార్యక్రమాలు నిర్వహించి, స్వామివారికి వివిధ రకాల పత్రి, ఫలాలను సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. కైంకర్యపరులు మునగాల శ్రీనివాసరావు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. దేవస్థాన అధ్యక్షులు వూట్ల పాల శ్రీనివాస్‌తో పాటు పలువురు పెద్ద శ్రేష్టులు, భక్తులు, సభ్యులు పాల్గొని పూజా కార్యక్రమాలను నిర్వహించారు.

More in Local