← Back to news

ప్రతి చేతికీ ఉపాధి హామీ పని

By BK· 4h ago· TG
ప్రతి చేతికీ ఉపాధి హామీ పని

ఎల్‌ నినో వల్ల కరువు పరిస్థితులు కనిపిస్తుండటంతో గ్రామీణ ప్రజలకు తోడుగా నిలిచేందుకు తెలంగాణ గవర్నమెంట్ కొత్త నిర్ణయం తీసుకుంది. ఏ ఒక్క కూలీ కూడా పనిలేకుండా ఉండొద్దని భావించి, ఉపాధి హామీ పథకంపై పంచాయతీరాజ్ సంస్థ కొత్త గైడ్‌లైన్స్ జారీ చేసింది. ఊళ్లలో కొత్త పనులు గుర్తించి, ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించింది. ఇప్పటికే అమలవుతున్న వికసిత గ్రామ పంచాయతీ ప్రణాళికతో పాటు మరిన్ని పనులు కల్పించనున్నారు. ఈ నెల 24 నుంచి 26 వరకు కరీంనగర్ జిల్లా సిబ్బందికి ట్రైనింగ్ క్లాసెస్ నిర్వహిస్తున్నారు.

More in TG