స్థానిక ఎన్నికలపై కోండ్రు మురళీమోహన్ సమీక్ష

స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీల విజయమే టార్గెట్గా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని మాజీ మంత్రి, రాజాం ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ లీడర్లకు పిలుపునిచ్చారు. శ్యాంపురం క్యాంప్ ఆఫీస్లో జరిగిన మీటింగ్లో ఆయన మాట్లాడుతూ, ప్రతీ గ్రామంలో, ప్రతీ ఇంట్లో కూటమి గవర్నమెంట్ చేసిన డెవలప్మెంట్, వెల్ఫేర్ స్కీమ్స్ గురించి ప్రచారం చేయాలన్నారు. ₹1,000 కోట్లతో నియోజకవర్గంలో సీసీ, బీటీ రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణాలు పూర్తి చేసి డెవలప్ చేశామని తెలిపారు.



