బెల్లంపల్లిలో ఉచితంగా మట్టి వినాయకులు

TG: పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించేలా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో భక్తులకు ఉచితంగా మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. వినాయక చవితిని పురస్కరించుకుని జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో కాంట చౌరస్తాలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామితో కలిసి మున్సిపల్ చైర్‌పర్సన్ దావ స్వాతి-రమేష్ బాబు భక్తులకు ప్రతిమలను అందజేశారు. మట్టి వినాయక ప్రతిమల వినియోగాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కార్యక్రమం చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.
