పోలీస్ వేధింపులే కారణం? వీరేష్ మృతిపై నిరసన

జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలం బూరెడ్డిపల్లికి చెందిన వీరేష్ పోలీస్ వేధింపులతో పురుగుల మందు తాగి కర్నూల్ ఆసుపత్రిలో 9 రోజులు పోరాడి మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. మృతదేహాన్ని గద్వాల ప్రభుత్వ ఆసుపత్రి ముందు రోడ్డుపై ఉంచి బంధువులు, TRS నియోజకవర్గ ఇన్చార్జ్ గొంగళ్ళ రంజిత్ కుమార్ నిరసన చేపట్టారు. వీరేష్ మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.





