← Back to news

గద్వాలలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు

By ARJUN· 1d ago· Jogulamba Gadwal
గద్వాలలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని తేరు మైదానంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. 37 వార్డుల నుంచి మహిళలు, యువతులు బతుకమ్మలతో తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి, పాటలకు నృత్యాలు చేశారు. బాల భవన్ చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, MLA బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

గద్వాలలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు
గద్వాలలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు

More in Local