తాత మధుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి

TG: అసెంబ్లీ స్పీకర్‌పై BRS ఎమ్మెల్సీ తాత మధు చేసిన అనుచిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు జగిత్యాల జిల్లా వెల్గటూర్‌లో నిరసన చేపట్టారు. మండల కేంద్రంలో తాత మధు దిష్టిబొమ్మను దహనం చేసి, అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ నినాదాలు చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ప్రజాప్రతినిధిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని కాంగ్రెస్ శ్రేణులు పేర్కొన్నాయి. తాత మధుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని డిమాండ్ చేశారు.

