← Back to news

ప్రశాంత వాతావరణంలో పరీక్షలు: కలెక్టర్

By Bala· 2h ago
ప్రశాంత వాతావరణంలో పరీక్షలు: కలెక్టర్

మెదక్ జిల్లాలో ఈ నెల 24న నిర్వహించనున్న టీజీపీఎస్సీ పరీక్షలను ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పారదర్శకంగా నిర్వహిస్తామని కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. నర్సాపూర్‌లోని బీవీఆర్‌ఐటీ పరీక్షా కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. పరీక్ష ప్రారంభానికి గంట ముందే కేంద్రాల గేట్లు మూసివేస్తామని స్పష్టం చేశారు. అభ్యర్థులు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, పరీక్ష హాల్లోకి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించబోమని వెల్లడించారు.

More in Local