← Back to news

ఆశాభోంస్లే కన్నుమూత

By aravinda nyayapati· 12 Apr 2026· Telugu Report· Hyderabad
ఆశాభోంస్లే కన్నుమూత

ప్రముఖ గాయని ఆశాభోంస్లే కన్నుమూశారు. శనివారం గుండెపోటుతో ముంబయిలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చేరిన ఆమె ప్రాణాలు కాపాడడానికి వైద్యులు శక్తివంచన లేకుండా కృషి చేశారు. అయినప్పటికీ కాసేపటి క్రితం ఆమె తుది శ్వాస విడిచారు.ఆశా ఇక లేరన్న విషయం తెలిసి సంగీత ప్రపంచం విషాదంలో మునిగిపోయింది. లతా మంగేష్కర్ సోదరి అయిన ఆశా తన వెర్సటైల్ సింగింగ్ తో గుర్తింపు తెచ్చుకున్నారు. 20కి పైగా భాషల్లో 12 వేలకు పైగా పాటలు పాడారు. తెలుగులో చిన్నికృష్ణుడు సినిమాలో జీవితం సప్తసాగరం గీతం సాంగ్ హిట్ అయింది.

More in Local