పుంగనూరులో ఉద్రిక్తత.. YCP నేతలపై TDP రాళ్లదాడి?

అన్నమయ్య జిల్లా పుంగనూరులో నామినేషన్ల సందర్భంగా ఉద్రిక్తత తలెత్తింది. MP మిథున్రెడ్డి, YCP నేతలు నామినేషన్ వేసేందుకు ఆఫీస్ లోకి వెళ్తుండగా.. TDP కార్యకర్తలు రాళ్ల దాడికి దిగినట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారిపోయింది. రెండు వర్గాల వారూ ఘర్షణకు దిగారు. YCP వాహనాలపై కూడా దాడి జరిగింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. నామినేషన్లను అడ్డుకునేందుకే ఇలా చేస్తున్నారనే ఆరోణపలు వినిపిస్తున్నాయి.



