← Back to news

స్థానిక ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు: కలెక్టర్ నిషాంతి

By B V Appalanaidu· 19h ago· Pathapaderu, Paderu, Alluri Sitharama Raju
స్థానిక ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు: కలెక్టర్ నిషాంతి

అల్లూరి జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పటిష్టమైన ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ నిషాంతి అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎన్నికల సిబ్బందికి శిక్షణ, పోలింగ్ కేంద్రాల్లో కనీస సౌకర్యాలు, ఫ్లయింగ్ స్క్వాడ్ల ఏర్పాటు, మారుమూల గిరిజన ప్రాంతాలకు రవాణా సదుపాయాలు కల్పించాలని సూచించారు. పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు శాఖల మధ్య సమన్వయంతో పనిచేయాలన్నారు.

More in Local